'పేట' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'పేట' ట్రైలర్ రిలీజ్ కి ముహూర్తం ఖరారు

  • కార్తీక్ సుబ్బరాజు నుంచి 'పేట'
  • సంక్రాంతికి భారీ విడుదల 
  • గట్టిపోటీ ఖాయమంటోన్న రజనీ ఫ్యాన్స్
కోలీవుడ్ దర్శకులలో కార్తీక్ సుబ్బరాజ్ కి ప్రత్యేకమైన స్థానం వుంది. మొదటి నుంచి కూడా విభిన్నమైన చిత్రాలను తెరకెక్కిస్తూ వస్తోన్న కార్తీక్ సుబ్బరాజు, తన తాజా చిత్రం 'పేట'తో ప్రేక్షకులను పలకరించనున్నాడు. తమిళ .. తెలుగు భాషల్లో ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖరారు చేశారు.

రేపు ఉదయం 11 గంటలకు ట్రైలర్ ను వదలనున్నారు. రజనీ అభిమానుల అంచనాలకి తగినట్టుగా .. ఈ సినిమాపై క్రేజ్ పెరిగేలా ఈ ట్రైలర్ ను కార్తీక్ సుబ్బరాజు కట్ చేసినట్టుగా చెబుతున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాలో, సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా కనిపించనున్నారు. విజయ్ సేతుపతి .. నవాజుద్దీన్ సిద్ధిఖీ కీలకమైన పాత్రలను పోషించిన సంగతి తెలిసిందే. తెలుగులో సంక్రాంతి బరిలోకి దిగుతోన్న ఈ సినిమా, మిగతా సినిమాలకి గట్టిపోటీ ఇవ్వడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
rajani
trisha
simran

More Telugu News