100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'జీరో'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిన 'జీరో'

  • మరుగుజ్జు పాత్రలో షారుక్ ఖాన్
  •  ప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల గ్రాస్ 
  • క్రిస్మస్ కి వసూళ్లు పెరిగే ఛాన్స్  
షారుక్ ఖాన్ కి కొంతకాలంగా సరైన హిట్ లేదు. దాంతో ఆయన అభిమానులంతా సాధ్యమైనంత త్వరగా ఆయనకి ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడాలని భావిస్తున్నారు. షారుక్ ఖాన్ కూడా అదే ఉద్దేశంతో ప్రయోగాత్మక చిత్రంగా 'జీరో'ను నిర్మించాడు. భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమాలో షారుక్ మరుగుజ్జుగా కనిపిస్తాడు. అనుష్క శర్మ .. కత్రినా కైఫ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన 4000 స్క్రీన్లకిపైగా విడుదల చేశారు.

ఆనంద్ ఎల్ రాయ్ తెరకెక్కించిన ఈ సినిమా, తొలి 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఇండియాలో మొదటి రోజున 20.14 కోట్లు .. రెండవ రోజున 18.22 కోట్లు .. మూడో రోజున 20.17 కోట్లను వసూలు చేసింది. ఓవర్సీస్ లో 3 రోజులకు గాను 35 కోట్ల గ్రాస్ ను .. 16 కోట్ల షేర్ ను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈ సినిమా 110.60 కోట్ల గ్రాస్ ను .. 50 కోట్ల షేర్ ను వసూలు చేసింది. క్రిస్మస్ రోజున ఈ సినిమా వసూళ్లు భారీగా పెరిగే ఛాన్స్ ఉందనే టాక్ వినిపిస్తోంది.
shah rukh khan
anushka sharma
katrina

More Telugu News