మళ్లీ బీజేపీ ప్రభుత్వం ఏర్పడడం మాకే కాదు, దేశానికీ అవసరమే!: పార్టీ చీఫ్ అమిత్‌షా
- అసెంబ్లీ ఎన్నికల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదు
- రాష్ట్రాల ఎన్నికల్లో వేర్వేరు అంశాలు ప్రభావం చూపుతాయి
- 16 రాష్ట్రాల్లో అధికారంతో దేశవ్యాప్తంగా బీజేపీ బలంగా ఉంది
అసెంబ్లీ ఎన్నికల్లో వేర్వేరు అంశాలు, స్థానిక సమస్యలు ప్రభావం చూపుతాయని చెప్పారు. 2014లో కేవలం ఆరు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పుడు 16 రాష్ట్రాలకు విస్తరించడాన్ని గుర్తు చేశారు. దీన్నిబట్టే లోక్‌సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అంచనా వేసుకోవాలని సూచించారు. ప్రతిపక్షాలన్నీ ‘మహాకూటమి’ పేరుతో జట్టుకడుతున్నా, ఆ కూటమి ఎన్నాళ్లో నిలవదని జోస్యం చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో శివసేనతో కలిసి పోటీ చేస్తామని, ఇప్పటికే ఆ పార్టీతో ఈ దిశగా చర్చలు జరుపుతున్నామని తెలిపారు.