సాయిపల్లవి నటన చూసి షాక్ అయ్యాను: శర్వానంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయిపల్లవి నటన చూసి షాక్ అయ్యాను: శర్వానంద్

  • సాయిపల్లవి సహజ నటి 
  • పాత్రని ఓన్ చేసుకునే తీరు అద్భుతం 
  • ఆమెతో పోటీపడి చేశాను
 హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన 'పడి పడి లేచె మనసు' ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. శర్వానంద్ - సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ మొదలైపోయాయి. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో శర్వానంద్ మాట్లాడుతూ .. " ముందుగా హను రాఘవపూడి నా దగ్గరకి ఒక యాక్షన్ మూవీ చేద్దామని వచ్చాడు. లవ్ స్టోరీ అయితేనే చేస్తానని నేను అనడంతో, ఈ కథను సిద్ధం చేసుకుని వచ్చి వినిపించాడు. ఈ కథకి నాయిక సాయిపల్లవి అయితేనే బాగుంటుందని ఆమెను అనుకున్నాము. నిజంగానే సాయిపల్లవి సహజమైన నటన చూసి నేను ఆశ్చర్యపోయాను. ఒక సీన్లో ఆమె ఎంతగా ఇన్వాల్వ్ అవుతుందో .. పాత్రని ఎంతగా ఓన్ చేసుకుంటుందో చూసి షాక్ అయ్యాను. ఆడియన్స్ నుంచి ఆమె ఎక్కువ మార్కులు ఎలా కొట్టేస్తుందనేది నాకు అర్థమైపోయింది. సాయిపల్లవితో చేయడానికి నేను తడబడలేదు .. నువ్వా నేనా అన్నట్టుగానే చేశాను" అంటూ చెప్పుకొచ్చాడు. 
sharwanand
saipallavi

More Telugu News