అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు.. అతి తక్కువగా బెల్లంపల్లిలో 15 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది: రజత్ కుమార్
Add ap7am to your home Screen

అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు.. అతి తక్కువగా బెల్లంపల్లిలో 15 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది: రజత్ కుమార్

  • ఓట్ల లెక్కింపు అధికారులను రాండమ్ విధానంలో కేటాయించాం
  • అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే కేంద్రంలోకి అనుమతిస్తాం
  • కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు సెల్ ఫోన్ లు తీసుకెళ్లకూడదు 
అత్యధికంగా శేరిలింగంపల్లిలో 42 రౌండ్లు, అతి తక్కువగా బెల్లంపల్లిలో 15 రౌండ్లలో కౌంటింగ్ ఉంటుందని తెలంగాణ ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్ వివరించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు అధికారులను రాండమ్ విధానంలో కేటాయించినట్టు చెప్పారు. అధికారులు, అభ్యర్థులు, ఏజెంట్లను మాత్రమే లెక్కింపు కేంద్రంలోకి అనుమతిస్తామని అన్నారు.

కౌంటింగ్ కేంద్రంలోకి ఏజెంట్లు సెల్ ఫోన్ లు తీసుకెళ్లేందుకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. 35 కేంద్రాల్లో మాక్ పోలింగ్ నిర్వహించాక ఈవీఎంలు రిఫ్రెష్ చేయలేదని, వాటిని క్లియర్ చేయకపోయినా, వీవీ ప్యాట్స్ లో స్లిప్పులను తొలగించారని రజత్ కుమార్ పేర్కొన్నారు. మాక్ పోలింగ్ ఓట్లు క్లియర్ చేయని చోట ఈసీ నిబంధనల ప్రకారం లెక్కింపు ఉంటుందని స్పష్టం చేశారు.
Telangana
Telangana Election 2018
counting
rajat kumar

More Telugu News