రైతు పట్ల అనుచిత వ్యాఖ్యలు.. గజ్వేల్ తహసీల్దార్ పై సస్పెన్షన్ వేటు
- "పురుగుల మందు తాగలేదా?" అంటూ అధికారి చేసిన వ్యాఖ్యల వీడియో వైరల్
- ప్రజాాగ్రహం వెల్లువెత్తడంతో విచారణకు ఆదేశించిన కలెక్టర్
- ప్రాథమిక విచారణ నివేదిక ఆధారంగా సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ
సిద్దిపేట జిల్లాలో ఓ రైతు పట్ల అమానవీయంగా, అనుచితంగా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారిపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. భూ వివాదం విషయమై తనను కలిసేందుకు వచ్చిన రైతును కించపరిచేలా మాట్లాడాడంటూ గజ్వేల్ తహసీల్దార్ చిట్టంపల్లి స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
వివరాల్లోకి వెళితే.. గజ్వేల్ మండలం మక్త మాసన్‌పల్లి గ్రామానికి చెందిన రైతు యేసు, రీజనల్ రింగ్ రోడ్ (ఆర్ఆర్ఆర్) భూ సేకరణ పరిహారం విషయంలో తన బంధువులతో ఉన్న వివాదంపై మాట్లాడేందుకు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్‌తో కలిసి ఆయన తహసీల్దార్ స్వామిని కలిశారు. రైతు తన సమస్యను వివరిస్తుండగా, అధికారి స్పందించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది.
“ఇంకా బతికే ఉన్నావా? పురుగుల మందు తాగలేదా?” అంటూ తహసీల్దార్ రైతును ప్రశ్నించారు. ఉద్దేశపూర్వకంగానే అలా అన్నారా అని ప్రశ్నించగా.. "అవును, ఉద్దేశపూర్వకంగానే అన్నాను" అని అధికారి బదులివ్వడం వీడియోలో స్పష్టంగా రికార్డయింది.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తహసీల్దార్ తీరుపై తీవ్ర ప్రజా వ్యతిరేకత వ్యక్తమైంది. రైతుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సిద్దిపేట జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్‌డీఓ) ప్రాథమిక విచారణ జరిపి, తహసీల్దార్ ప్రవర్తన సరికాదని నివేదిక సమర్పించారు.
ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్.. తహసీల్దార్ స్వామిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. ఈ ఘటన సుమారు 5-6 నెలల క్రితం జరిగిందని, ఆ తర్వాత తన భూ వివాదం పరిష్కారమై పరిహారం డబ్బులు కూడా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయని రైతు యేసు స్వయంగా వెల్లడించిన మరో వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఘటన పాతదే అయినప్పటికీ, అధికారి ప్రవర్తన సరైంది కాదన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకుంది.