ఇల్లు గడవడం కోసం చేతికి వున్న గాజులు అమ్మేశాను: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఇల్లు గడవడం కోసం చేతికి వున్న గాజులు అమ్మేశాను: సీనియర్ హీరోయిన్ ఖుష్బూ

  • మమ్మల్ని వదిలేసి నాన్న వెళ్లిపోయాడు 
  • తినడానికి తిండి ఉండేది కాదు 
  • అందుకే చెన్నై వదిలి రాలేదు     
తెలుగు .. తమిళభాషల్లో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకున్న నిన్నటితరం కథానాయికలలో ఖుష్బూ ఒకరు. తాజాగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "మాది ముంబై .. అమ్మను .. నన్ను .. ముగ్గురు అన్నయ్యలను నడిరోడ్డుపై వదిలేసి మా నాన్న వెళ్లిపోయాడు. డబ్బు .. నగలు కూడా తీసుకుని ఆయన వెళ్లిపోవడంతో, మా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది.

ఇల్లు గడవడం కోసం చేతికి వున్న గాజులు .. ఉంగరం కూడా అమ్మేశాను. ఒక్కోసారి చేతిలో డబ్బు .. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. తెలుగు సినిమాలు చేస్తోన్న సందర్భంలో రామానాయుడు గారు .. రాఘవేంద్రరావుగారు నైతికంగా నాకు ఎంతో మద్దతు ఇచ్చారు. వాళ్లు అందించిన సహకారాన్ని మరిచిపోలేను. తెలుగు చిత్రపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కి వెళ్లిపోయింది. తమిళ సినిమాల్లో వేషాలు ఎక్కువగా వస్తుండటంతో నేను చెన్నైలోనే వుండి పోయాను" అని చెప్పుకొచ్చారు.      
khushboo

More Telugu News