కొత్త ఎమ్మెల్యేల కోసం ముస్తాబవుతున్న తెలంగాణ అసెంబ్లీ
Add ap7am to your home Screen

కొత్త ఎమ్మెల్యేల కోసం ముస్తాబవుతున్న తెలంగాణ అసెంబ్లీ

  • సర్వాంగ సుందరంగా తయారవుతున్న అసెంబ్లీ
  • ఫుట్ పాత్ లకు కొత్త టైల్స్
  • అసెంబ్లీ హాల్ లో కొత్త గ్రీన్ కార్పెట్
11వ తేదీన ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థుల భవితవ్యం తేలబోతోంది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరగడంతో... అన్ని పార్టీల అభ్యర్థుల్లో గుబులు మొదలైంది. పెరిగిన ఓటింగ్ తమకు అనుకూలంగా ఉందా? లేక వ్యతిరేకంగా ఉందా? అనే టెన్షన్లో నేతలు ఉన్నారు.

మరోవైపు, నూతన ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పలికేందుకు తెలంగాణ అసెంబ్లీ ముస్తాబవుతోంది. హుందాతనం ఉట్టిపడేలా అసెంబ్లీని తీర్చిదిద్దుతున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో ఆహ్లాదకర వాతావరణం ఉండే మొక్కలను నాటారు. ఫుట్ పాత్ లకు కొత్త టైల్స్ వేశారు. అసెంబ్లీ హాల్ లో కొత్త గ్రీన్ కలర్ కార్పెట్ ను ఏర్పాటు చేశారు. లైబ్రరీ, మీడియా పాయింట్, డిస్పెన్సరీల వద్ద చిన్నచిన్న మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేస్తున్నారు. సభ్యుల ప్రమాణస్వీకారం నాటికి అసెంబ్లీ సర్వాంగ సుందరంగా తయారుకానుంది. 
Telangana
assembly
renovation

More Telugu News