బీజేపీతో టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది: ఖుష్బు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీతో టీఆర్ఎస్ లోపాయికారీ ఒప్పందం చేసుకుంది: ఖుష్బు

  • కేసీఆర్‌ది ప్రజా వ్యతిరేక పాలన
  • కవితకు మాత్రమే మేలు జరిగింది
  • బతుకమ్మ చీరల్లో రూ.200 కోట్ల అవినీతి
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క కవితకు మాత్రమే మేలు జరిగిందని కాంగ్రెస్ మహిళా నేత, సినీ నటి ఖుష్బు విమర్శించారు. నేడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె కేసీఆర్ పాలనపై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ పరిపాలనంతా రైతు, మహిళ,  ప్రజా వ్యతిరేకంగానే సాగిందని ఖుష్బు ఆరోపించారు.

కేసీఆర్ మంత్రివర్గంలో ఒక్క మహిళ కూడా లేకపోవడం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్.. బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుందని ఆమె ఆరోపించారు. తెలంగాణ అవినీతిలో రెండో స్థానంలో ఉందని.. ఒక్క బతుకమ్మ చీరల్లోనే రూ.200 కోట్ల అవినీతి జరిగిందని ఖుష్బు విమర్శించారు.
Khushboo
KCR
Kavitha
TRS
BJP

More Telugu News