రీ షూట్ కోసం పారితోషికం అడిగిన సాయిపల్లవి?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రీ షూట్ కోసం పారితోషికం అడిగిన సాయిపల్లవి?

  • శర్వానంద్ జోడీగా సాయిపల్లవి 
  • రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సాగే కథ 
  • డిసెంబర్ 21వ తేదీన విడుదల    
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ .. సాయిపల్లవి జంటగా 'పడి పడి లేచె మనసు' రూపొందుతోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా నిర్మితమవుతోన్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించాడు. సుధాకర్ - ప్రసాద్ నిర్మిస్తోన్న ఈ సినిమాను డిసెంబర్ 21వ తేదీన విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలోని కొన్ని సీన్స్ ను రీ షూట్ చేస్తున్నారు.

కొన్ని సీన్స్ మరింత బాగా రావాలనే ఉద్దేశంతో దర్శక నిర్మాతలు రీ షూట్ ను ప్లాన్ చేశారు. ఇందుకోసం సాయిపల్లవి డేట్స్ మళ్లీ అవసరమయ్యాయి. అయితే కొత్తగా ఇచ్చే డేట్స్ కి కూడా పారితోషికం ఇవ్వవలసిందేనని సాయిపల్లవి అడిగితే అందుకు నిర్మాతలు అంగీకరించినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది. ఎక్కువ పారితోషికం ఇస్తామన్నా, కథ బాగోలేకపోతే సాయిపల్లవి 'నో' చెప్పేస్తుంది. అలాంటి సాయిపల్లవి ఈ సినిమా రీ షూట్ కి పారితోషికం అడిగిందనే వార్తలో నిజం ఉండకపోవచ్చనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.      
sharwanand
saipallavi

More Telugu News