చిరంజీవి .. కొరటాల సినిమా కూడా చరణ్ బ్యానర్లోనే?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి .. కొరటాల సినిమా కూడా చరణ్ బ్యానర్లోనే?

  • చరణ్ నిర్మాతగా రూపొందుతోన్న 'సైరా'
  • చిరూ తదుపరి సినిమా కొరటాలతో 
  • సంక్రాంతి పండుగ తరువాత లాంచ్
చిరంజీవి హీరోగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఎన్నో సినిమాలను నిర్మించారు. ఆ సినిమాలు ఘన విజయాలను సాధించాయి .. చిరంజీవి కెరియర్లో చెప్పుకోదగినవిగా నిలిచాయి. రాజకీయాల్లోకి వెళ్లిన చిరంజీవి, 'ఖైదీ నెంబర్ 150'తో రీ ఎంట్రీ ఇచ్చారు. దాంతో ఆయన తదుపరి సినిమాను తమ బ్యానర్లో చేయనున్నట్టుగా అరవింద్ చెప్పారు.

కానీ 151వ సినిమాగా 'సైరా' కూడా చరణ్ బ్యానర్లోనే రూపొందుతోంది. దాంతో ఆ తరువాత సినిమాను చిరంజీవి గీతా ఆర్ట్స్ లో చేయవచ్చని అనుకున్నారు. 153వ సినిమాను కొరటాల దర్శకత్వంలో చిరంజీవి చేయనున్నారు. ఈ సినిమాకి కూడా నిర్మాతగా చరణ్ వ్యవహరించనున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా భారీ బడ్జెట్ మూవీ కావడం వలన, కొరటాల సన్నిహితుడు సహ నిర్మాతగా ఉంటాడని చెప్పుకుంటున్నారు. సంక్రాంతి తరువాత ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు.   
chiranjeevi
Koratala Siva

More Telugu News