జగన్ పై దాడి కేసు విచారణలో రాజకీయ జోక్యం ఉండకూడదు!: పవన్ కల్యాణ్
Add ap7am to your home Screen

జగన్ పై దాడి కేసు విచారణలో రాజకీయ జోక్యం ఉండకూడదు!: పవన్ కల్యాణ్

  • జగన్ పై విజయమ్మ, షర్మిల దాడి చేయించారని ఆరోపించడం సరికాదు
  • ఏ తల్లీ కన్నకొడుకుపై దాడి చేయించదు
  • నాకు కూడా పోలీసులు సరైన భద్రత కల్పించలేదు
వైసీపీ అధినేత జగన్ పై ఆయన తల్లి విజయమ్మ, చెల్లి షర్మిలలు దాడి చేయించారని ఆరోపించడం సరైంది కాదని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు. ఏ తల్లి కూడా కన్నకొడుకుపై దాడి చేయించదని చెప్పారు. విజయమ్మ, షర్మిలలు తనను ఎన్నోసార్లు తిట్టారని... అయినా వారిని తాను పల్లెత్తు మాట కూడా అనలేదని తెలిపారు. పరిధిని దాటి వ్యాఖ్యలు చేయడం టీడీపీ నేతలకు సరికాదని మండిపడ్డారు. జగన్ పై దాడి కేసు విచారణలో రాజకీయ జోక్యం ఉండరాదని... అప్పుడే అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య ఉందని అన్నారు. తన పర్యటనకు కూడా పోలీసులు సరైన భద్రత కల్పించలేదని... దానివల్ల తాను చాలా ఇబ్బంది పడ్డానని చెప్పారు.
vijayamma
jagan
sharmila
Pawan Kalyan

More Telugu News