‘ఇండియా’ కూటమి నేతలను కలిసేందుకు సీజేఐ నో.. పిటిషన్‌తో రావాలని సూచన!
- సమస్యలపై పిటిషన్ వేయాలని సీజేఐ సూచన
- రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలనా స్థాయిలో సమావేశం కావడం సాధ్యం కాదని స్పష్టీకరణ
- ఇప్పటికే విచారణలో ఉన్న అంశాలపై చర్చ కోసం భేటీ కావాలనుకున్న విపక్ష నేతలు
- పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానం విధి అని సీజేఐ స్పష్టీకరణ
- నేడు సుప్రీంకోర్టు దిశగా ప్రతిపక్షాల మార్చ్
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌తో భేటీ కావాలన్న ఇండియా కూటమి నేతల ప్రయత్నం ఫలించలేదు. వారి అభ్యర్థనను సీజేఐ తిరస్కరించినట్లు సమాచారం. రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలనా స్థాయిలో సమావేశం కావడం సాధ్యం కాదని స్పష్టం చేసినట్లు తెలిసింది. తమ సమస్యలను పిటిషన్ రూపంలో కోర్టు ముందుంచాలని సూచించారు. ఈ నేపథ్యంలో నేడు సుప్రీంకోర్టు దిశగా ప్రతిపక్షాలు చేపట్టనున్న మార్చ్‌పై ఆసక్తి నెలకొంది.
ఇప్పటికే విచారణలో ఉన్న అంశాలపై నేతలు భేటీ కావాలనుకుంటున్నారని సీజేఐ పేర్కొన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. పిటిషన్లను విచారించి తీర్పులు ఇవ్వడమే న్యాయస్థానం విధి అని ఆయన స్పష్టం చేసినట్లు వెల్లడించాయి. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు సుప్రీంకోర్టు కట్టుబడి ఉందని, న్యాయస్థానం తలుపులు అందరికీ 24 గంటలూ తెరిచే ఉంటాయని ఆయన చెప్పినట్లు సమాచారం.
‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ’ (ఎస్‌ఐఆర్)లో అక్రమాలు జరిగాయని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది. ఈ అంశంపై సోమవారం సుప్రీంకోర్టు దిశగా మార్చ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ నిరసన ఏ ఒక్క రాజకీయ పార్టీకి పరిమితం కాదని, భారతీయులందరిదని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఎన్నికల సంస్కరణలపై ఇండియా కూటమి గత శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు వినతిపత్రం సమర్పించిన విషయం తెలిసిందే. సీఈసీ రాజీనామా, 2023 చట్టం రద్దు, ఎస్‌ఐఆర్ ప్రక్రియ నిలిపివేత, తొలగించినట్లు ఆరోపిస్తున్న 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్ల పునరుద్ధరణను కోరింది.
ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన రక్షణ కల్పించే 2023 చట్టంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదివారం విమర్శలు చేశారు. సీఈసీ, ఇతర కమిషనర్లను చట్టపరమైన చర్యల నుంచి కాపాడేందుకే ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆరోపించారు.