ఏడాదికి 13 నెలలు.. ఈ దేశంలో క్యాలెండరే ప్రత్యేకం!
- ఇథియోపియాలో ఏడాదికి 13 నెలలు
- మొదటి 12 నెలల్లో 30 రోజులు
- పగుమే నెలలో ఐదు లేదా ఆరు రోజులు
- ఇథియోపియా కొత్త సంవత్సరం సెప్టెంబరులో ప్రారంభం
- అక్కడి క్యాలెండర్ ప్రపంచ క్యాలెండర్ కంటే ఏడెనిమిదేళ్లు వెనుక
సాధారణంగా ఏడాదికి 12 నెలలే ఉంటాయని మనకు తెలుసు. జనవరి నుంచి డిసెంబరు వరకు ఇదే లెక్కను ప్రపంచంలోని చాలా దేశాలు అనుసరిస్తాయి. కానీ ఆఫ్రికాలోని ఇథియోపియాలో మాత్రం క్యాలెండర్ లెక్కే భిన్నం. అక్కడ ఏడాదికి 13 నెలలు ఉంటాయి. అంతేకాదు.. ప్రపంచ దేశాల క్యాలెండర్‌తో పోలిస్తే అక్కడి సంవత్సరం సుమారు ఏడెనిమిదేళ్లు వెనుకబడి ఉంటుంది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ ప్రత్యేక క్యాలెండర్ ఇప్పటికీ అక్కడి ప్రజల జీవితంలో భాగంగా కొనసాగుతోంది.
30 రోజులే.. 12 నెలలు!
ఇథియోపియా క్యాలెండర్‌ను గీజ్ క్యాలెండర్ అని కూడా పిలుస్తారు. ఇందులో మొదటి 12 నెలలకు ఒక్కో నెలలో సరిగ్గా 30 రోజులే ఉంటాయి. అంటే ఈ 12 నెలల్లో మొత్తం 360 రోజులు. మిగిలిన రోజులను 13వ నెలలో సర్దుబాటు చేస్తారు. ఆ నెల పేరే పగుమే. సాధారణ సంవత్సరంలో దీనికి ఐదు రోజులు ఉంటాయి. లీపు సంవత్సరంలో ఆరు రోజులు వస్తాయి. ఇలా ఏడాదికి 365 లేదా 366 రోజులు పూర్తవుతాయి.
సెప్టెంబరులోనే కొత్త సంవత్సరం
గ్రెగోరియన్ క్యాలెండర్‌లో జనవరి 1న కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఇథియోపియాలో మాత్రం సెప్టెంబరులో నూతన సంవత్సర వేడుకలు జరుగుతాయి. వీటిని ‘ఎంకుటాటాష్’ అని పిలుస్తారు. సాధారణంగా సెప్టెంబరు 11న కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. కొన్నిసార్లు సెప్టెంబరు 12న వస్తుంది.
నెలల పేర్లూ ప్రత్యేకమే!
ఇథియోపియా క్యాలెండర్‌లో మెస్కెరెమ్, టికిమ్ట్, హిదార్, తహ్సాస్, తిర్, యెకాటిట్, మెగాబిట్, మియాజ్యా, గిన్‌బోట్, సెనె, హమ్లె, నెహాసె అనే 12 నెలలు ఉంటాయి. చివరగా పగుమే వస్తుంది. ఈ నెలల పేర్లు ఆ దేశ చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.
2026.. అక్కడ 2018 లేదా 2019!
ఇథియోపియా క్యాలెండర్‌లో సంవత్సరం సంఖ్య కూడా భిన్నంగా ఉంటుంది. క్రీస్తు జనన సంవత్సరాన్ని లెక్కించే విధానంలో ఉన్న చారిత్రక వ్యత్యాసాల వల్ల ఈ తేడా ఏర్పడింది. అందుకే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 2026 నడుస్తుంటే, ఇథియోపియా క్యాలెండర్‌లో తేదీని బట్టి 2018 లేదా 2019 ఉంటుంది. అంతర్జాతీయ వ్యవహారాల్లో గ్రెగోరియన్ క్యాలెండర్‌ను ఉపయోగిస్తున్నా.. సంప్రదాయ వేడుకలు, రోజువారీ జీవితంలో ఇథియోపియా క్యాలెండర్‌కు ప్రత్యేక స్థానం ఉంది.