రైతు బజార్లలో కిలో సన్నబియ్యం రూ.50కే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- ఏపీ రైతు బజార్లలో కెఎన్ఎం సన్నబియ్యం విక్రయాలు
- రూ.49కే అందుబాటులో ఉన్న బీపీటీ బియ్యం
- పెరిగిన ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించే చర్య
- ఒక్కో కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాక్
సామాన్య ప్రజలకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో, రైతు బజార్ల ద్వారా నాణ్యమైన సన్నబియ్యాన్ని సరసమైన ధరకే అందించేందుకు శ్రీకారం చుట్టింది. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రైతు బజార్లలో కేఎన్ఎం, ఆర్ఎన్ఆర్ రకం సన్నబియ్యాన్ని కిలో రూ. 50కే విక్రయిస్తున్నారు.
ఇప్పటికే రైతు బజార్లలో బీపీటీ రకం బియ్యం కిలో రూ. 49కు అందుబాటులో ఉండగా, తాజాగా కేఎన్ఎం రకాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఒక్కో కుటుంబానికి నెలకు 26 కిలోల ప్యాకింగ్‌ను పంపిణీ చేయనున్నారు. బహిరంగ మార్కెట్‌లో సన్నబియ్యం ధర కిలో రూ. 90 వరకు ఉన్న తరుణంలో, ప్రభుత్వ నిర్ణయం సామాన్యులకు భారీ ఊరటనివ్వనుంది. నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకే ప్రజలకు చేరవేయడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం.
ఈ విక్రయాలను పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలోని భవానీపురం రైతు బజార్‌లో నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు తమ సమీపంలోని రైతు బజార్లను సంప్రదించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రభుత్వం సూచించింది.