'నాలో ఏం నచ్చిందో తెలియదు.. వారే వచ్చి పెళ్లి చేసుకున్నారు'.. ఓ బిచ్చగాడికి 21 మంది భార్యలు!
- వారే పెళ్లి ప్రపోజల్స్ పెట్టారని, కాదనలేకపోయానని వివరణ
- భార్యలందరి పేర్లు కూడా గుర్తులేక ఇబ్బంది పడుతున్న వ్యక్తి
- వంతులవారీగా భార్యలతో కలిసి భిక్షాటన చేస్తూ జీవనం
సాధారణంగా ఒకరిద్దరు భార్యలుంటేనే వారిని పోషించడం కష్టమని చాలామంది అంటుంటారు. కానీ, బంగ్లాదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా 21 మందిని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. విచిత్రం ఏమిటంటే.. అతనికి తన భార్యలందరి పేర్లు కూడా సరిగా గుర్తులేవు. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బంగ్లాదేశ్‌కు చెందిన 35 ఏళ్ల మోరు మియా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. తనకు 21 మంది భార్యలు ఉన్నారని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. తాను ఎప్పుడూ కావాలని పెళ్లి చేసుకోలేదని, మహిళలే తన వద్దకు పెళ్లి ప్రస్తావనతో వచ్చారని తెలిపాడు.
వారిలో చాలామంది తనకంటే వయసులో పెద్దవారని, వారిని నిరాకరించడం అగౌరవంగా భావించి పెళ్లి చేసుకున్నానని వివరించాడు. తనలో ఏం చూసి మహిళలు ఆకర్షితులవుతున్నారనే ప్రశ్నకు, ఆ విషయం వారినే అడగాలని సమాధానమిచ్చాడు.
మోరు మియా ఒక చిన్న గదిలో నివసిస్తున్నాడు. రోజూ వంతులవారీగా ఒక్కో భార్యను తనతో పాటు భిక్షాటనకు తీసుకెళ్తాడు. తన భార్యల పేర్లు చెప్పమని అడిగినప్పుడు, అతను షీలా, నర్గీస్, సెలెనా, ఆలియా, తారా, జ్యోత్స్న, రబియా, పరుల్ ఇలా సుమారు 8 మంది పేర్లను మాత్రమే గుర్తుచేసుకోగలిగాడు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో క్లిప్‌లు నెట్టింట వైరల్ కావడంతో పాటు బంగ్లాదేశ్ మీడియా కథనాల ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.