ఎస్టీ నియోజకవర్గంలో పోటీ చేస్తాననడం పవన్ అజ్ఞానం!: సోమిరెడ్డి
- నారా లోకేష్ పై నిన్న పవన్ విమర్శలు
- పవన్ వాడిన భాషను మరెవరూ వాడలేరు
- ఆయన రాజకీయ పరిజ్ఞానం చాలా స్వల్పమన్న సోమిరెడ్డి
ఎస్టీలకు రిజర్వ్ అయిన పాడేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్న పవన్ వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఆయన రాజకీయ పరిజ్ఞానం ఎంత స్వల్పమో తెలుస్తోందని అన్నారు. పవన్ వాడిన భాషను ఏ పార్టీ ఉపయోగించదని, వారసత్వ రాజకీయాలు వద్దంటున్న పవన్, తన అన్న వారసత్వం నుంచే రాజకీయాల్లోకి రాలేదా? అని సోమిరెడ్డి ప్రశ్నించారు. నరేంద్ర మోదీతో కలసి వైఎస్ జగన్, పవన్ కల్యాణ్ నడుస్తారని ఇప్పటికే ప్రజలు అనుకుంటున్నారని, అంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని వ్యాఖ్యానించారు.