మోదీ గారూ, ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోండి.. కేంద్రానికి లేఖ రాసిన సీఎం చంద్రబాబు!
- తిత్లీ తుపానుతో రూ.2,800 కోట్ల నష్టం
- రూ.1,200 కోట్లు ఇవ్వాలని విజ్ఞప్తి
- తీవ్ర విధ్వంసం జరిగిందని వివరణ
రాష్ట్రానికి తక్షణ సాయంగా రూ.1,200 కోట్లు విడుదల చేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. తిత్లీ దెబ్బకు మౌలిక వసతులు ఛిన్నాభిన్నం అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తుపాను ప్రభావంతో జిల్లాలోని వ్యవసాయ రంగానికి రూ.800 కోట్లు, ఉద్యానవన శాఖకు రూ.1,000 కోట్లు, విద్యుత్ రంగానికి రూ.500 కోట్లు, రోడ్లు రూ.100 కోట్లు, పంచాయితీరాజ్ శాఖకు మరో రూ.100 కోట్లు, పశుసంవర్ధక శాఖకు రూ.50 కోట్లు, ఇరిగేషన్ శాఖకు మరో వంద కోట్ల నష్టం సంభవించిందని వెల్లడించారు. పెద్ద మనసుతో శ్రీకాకుళం జిల్లాను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.