సీఎం రమేశ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం రమేశ్ ఇంట్లో ముగిసిన ఐటీ సోదాలు

  • ఎలాంటి పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకోలేదు
  • నిజాయతీగా ఉన్నాం.. ఎలాంటి ఆధారాలు లభించలేదు
  • సీఎం రమేశ్ సోదరుడు సురేష్
తెలుగుదేశం నేత, పార్లమెంటు సభ్యుడు సీఎం రమేశ్ నివాసంలో ఐటీ అధికారులు ఈ రోజు నిర్వహించిన దాడులు ముగిశాయి. కడప జిల్లాలలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని రమేష్ నివాసంలో సుమారు పది గంటల పాటు సోదాలు నిర్వహించారు. రమేశ్ సోదరుడు సురేష్ సమక్షంలో ఐటీ సోదాలు జరిగాయి. అనంతరం, మీడియాతో సురేష్ మాట్లాడుతూ, తమ నుంచి ఎలాంటి పత్రాలను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. నిజాయతీగా ఉన్నాం కనుకే ఇన్ని గంటల పాటు సోదాలు చేసినా ఐటీ అధికారులకు ఎలాంటి ఆధారాలు లభించలేదని అన్నారు. 
CM Ramesh
brother suresh
it raids

More Telugu News