సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • హన్సిక హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రం 
  • దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన నాని 
  • 'ఎన్టీఆర్' బయోపిక్ లో మలయాళ నటి 
*  నయనతార, త్రిషలా ఇప్పుడు హన్సిక కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా ఒకటి చేస్తోంది. జమీల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం పేరు 'మేహ'. ఇది ఆమెకు ఏభయ్యవ చిత్రం అవుతుంది. దీంతో ఈ చిత్రం పట్ల హన్సిక ప్రత్యేకమైన ప్రేమను చూపిస్తోందట.
*  'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు', 'బ్రహ్మోత్సవం' చిత్రాల దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం గీతా ఆర్ట్స్ సంస్థలో నాని హీరోగా ఓ చిత్రాన్ని చేస్తున్నాడు. తాజాగా నానికి శ్రీకాంత్ స్క్రిప్ట్ మొత్తం వినిపించాడని, నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని సమాచారం.
*  క్రిష్ దర్శకత్వంలో రెండు భాగాలుగా వస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ లో చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి పాత్ర కోసం మలయాళ నటి మంజిమా మోహన్ ను ఎంపిక చేశారు. త్వరలో హైదరాబాద్ అబిడ్స్ లోని ఎన్టీఆర్ ఇంటిలో జరిగే షూటింగులో మంజిమ పాల్గొంటుందట. 
Hansika
Nani
Krish

More Telugu News