నిమజ్జనంలో గొడవ... పోలీసులపై రాళ్లదాడి!
- జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో ఘటన
- శ్రుతిమించిన యువకుల అల్లరి
- అడ్డుకున్న పోలీసులపై దాడి
పోలీసులు, యువకుల మధ్య వాగ్వాదం జరుగగా, పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు, వారి వాహనం అద్దాలను పగులగొట్టారు. తొలుత పోలీసుల సంఖ్య తక్కువగా ఉండటంతో, వారు అదనపు బలగాలను పిలిపించేంత వరకూ నిరసన కొనసాగింది. బలగాలు వచ్చేసరికి యువకులు తలోదిక్కుగా పారిపోగా, ప్రత్యేక పికెటింగ్ ను పోలీసులు ఏర్పాటు చేశారు.