తల్లి కాదు సైకో.. ఫోన్ కు బానిసై కన్నబిడ్డలను తీవ్రంగా హింసించిన అభిరామి!
- వెల్లడించిన తమిళనాడు పోలీసులు
- ప్రియుడితో గంటలకొద్దీ చాటింగ్
- కన్నబిడ్డలకు చిత్రహింసలు
తొలుత భర్త విజయన్ ను కూడా హతమార్చి ప్రియుడితో పారిపోవాలని అభిరామి అనుకుందనీ, కానీ అతను బ్యాంకు నుంచి ఆలస్యంగా రావడంతో పిల్లాడు అజయ్(7) అమ్మాయి కరిమిలా(5)కు పాలలో విషం కలిపి ఇచ్చి పారిపోయిందని పోలీసులు తెలిపారు.
చెన్నైకి చెందిన విజయన్ ఓ ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేస్తుండగా, ఇంట్లోనే ఉంటున్న అభిరామికి స్థానికంగా ఓ హోటల్ లో పనిచేస్తున్న సుందరం అనే యువకుడితో పరిచయమైంది. అదికాస్తా ప్రేమగా మారడంతో భర్త, పిల్లలను చంపేసి అతడితో వెళ్లిపోవాలని నిర్ణయించుకుంది.