కేసీఆర్ పాలన ముగిసింది: ఢిల్లీలో ఉత్తమ్ కుమార్
Add ap7am to your home Screen

కేసీఆర్ పాలన ముగిసింది: ఢిల్లీలో ఉత్తమ్ కుమార్

  • పదవీకాలం ఉండగానే అసెంబ్లీని రద్దు చేశారు
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం
  • కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయం
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ సమావేశం ముగిసింది. ఈ సమావేశం ముగిసిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ రద్దైన అంశంపై టీపీసీసీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. తెలంగాణలో కేసీఆర్ పాలన ముగిసి పోయిందని ఆయన అన్నారు. పదవీకాలం ఉండగానే ముందుగానే అసెంబ్లీని రద్దు చేశారని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

కేసీఆర్ తన గొయ్యి తానే తవ్వుకున్నారని... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఫుల్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇంతకు మించి మాట్లాడేందుకు ఉత్తమ్ నిరాకరించారు. తర్వాత అన్ని విషయాలపై క్లియర్ గా మాట్లాడతానని చెప్పి, మీడియా ప్రతినిధుల ముందునుంచి కదిలారు. 
Uttam Kumar Reddy
Telangana
assembly
dissolution

More Telugu News