బాలకృష్ణ జోడీగా ఛాన్స్ వచ్చింది .. కానీ చేయలేదు: సుప్రియ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ జోడీగా ఛాన్స్ వచ్చింది .. కానీ చేయలేదు: సుప్రియ

  • హీరోయిన్ గా నిలబడిపోవాలనుకోలేదు 
  • నటనను సీరియస్ గా తీసుకోలేదు 
  • ప్రొడక్షన్ వ్యవహారాలపైనే దృష్టి పెట్టాను    
అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు .. యార్లగడ్డ సుప్రియ, 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా ద్వారా తెలుగు తెరకి పరిచయమయ్యారు. ఆ తరువాత నటనను దూరం పెట్టిన ఆమె, మళ్లీ ఇంతకాలానికి 'గూఢచారి' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సందర్భంగా ఆమె 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

 "చిన్నప్పటి నుంచి కూడా సినిమాలంటే చాలా ఇష్టం. అయితే హీరోయిన్ గా నిలబడిపోవాలనే ఉద్దేశంతో నేను సినిమాల్లోకి రాలేదు .. కావాలని గ్యాప్ తీసుకోలేదు. నేను 11యేళ్ల వయసులోనే 'రావుగారిల్లు' సినిమాకి క్యాషియర్ గా పనిచేశాను. 16 యేళ్ల వయసులో 'గాయం' సినిమాకి సంబంధించిన షెడ్యూల్స్ ను దగ్గరుండి చూసుకున్నాను. అల్లు అరవింద్ గారు అడగడంతో 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' చేయడానికి ఓకే అన్నాను. కెమెరా ముందుకు వెళ్లాక అక్కడి వాతావరణం నాకు సెట్ కాదు అనిపించింది .. ప్రొడక్షన్ చూసుకోవడమే బెటర్ అనుకున్నాను. అందువల్లనే బాలకృష్ణ సినిమా నుంచి ఛాన్స్ వచ్చినా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.
supriya

More Telugu News