మైసూర్ ప్యాలెస్ లో కన్నడ నటి ఫొటో షూట్.. మండిపడుతున్న జనాలు
- మైసూరు ప్యాలెస్ దర్బార్ హాల్ లో ఫొటో షూట్
- ప్యాలెస్ పరిసరాల్లో ఫొటో షూట్ పై అమల్లో ఉన్న నిషేధం
- వివాదాస్పదమైన నిధి సుబ్బయ్య ఫొటో షూట్
నిధి ఫొటో షూట్ కు అధికారులు ఎలా అనుమతించారంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దీనిపై నిధి స్పందిస్తూ, ప్యాలెస్ లో తాను ఫొటో షూట్ చేయలేదని, కేవలం ఒక టూరిస్ట్ మాదిరి అక్కడకు వెళ్లిన తాను, అందరు టూరిస్టుల మాదిరే ఫొటో తీసుకున్నానని వివరణ ఇచ్చింది. మరోవైపు ప్యాలెస్ భద్రతాధికారి ఏసీపీ శైలేంద్ర మాట్లాడుతూ, ప్యాలెస్ లో ఫొటోలు తీయడంపై నిషేధం లేదని, నవరాత్రుల సమయంలో, అంబారి ఉన్నప్పుడు మాత్రమే నిషేధం అమల్లో ఉంటుందని చెప్పారు.