పళ్లున్న చెట్టుకేగా రాళ్ల దెబ్బలు అనుకుని ఊరుకుంటా: సన్నీలియోన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పళ్లున్న చెట్టుకేగా రాళ్ల దెబ్బలు అనుకుని ఊరుకుంటా: సన్నీలియోన్

  • నాపై వచ్చే విమర్శలను పట్టించుకోను
  • వివాదాల్లోకి లాగినా వాటి గురించి ఆలోచించను
  • విమర్శలు, వివాదాలు నన్ను బాధ పెట్టలేవు
తనపై ఎన్ని విమర్శలు వచ్చినా, తనను వివాదాల్లోకి లాగినా తాను పట్టించుకోనని బాలీవుడ్ నటి సన్నీలియోన్ చెప్పింది. కొన్నిసార్లు కొన్ని విమర్శలు తనను బాధించేందుకు యత్నిస్తాయని... కానీ, అవి తనను బాధ పెట్టలేవని తెలిపింది. పళ్లున్న చెట్టుకేగా రాళ్ల దెబ్బలు అనుకుని ఊరుకుంటానని చెప్పింది.

అయితే, ఆ విమర్శలు తనను చాలా చికాకు పెడతాయని తెలిపింది. 'కరన్ జీత్ కౌర్: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీలియోన్' వెబ్ సిరీస్ ప్రారంభ వేడుకలో ఆమె మాట్లాడుతూ ఈ మేరకు స్పందించింది. కొన్ని వేడుకల్లో మీరు చేయాల్సిన నృత్య ప్రదర్శనలు రద్దయ్యాయని... మిమ్మల్ని పిలవడం సిగ్గుచేటని కొందరు రాజకీయ నాయకులు అన్నారని... అలాంటి వ్యాఖ్యలు మిమ్మల్ని బాధపెట్టాయా? అనే ప్రశ్నకు బదులుగా సన్నీ పైసమాధానం చెప్పింది. 
Sunny Leone

More Telugu News