లేడీ క్యారెక్టర్లో శ్రీనివాస రెడ్డి నటన సూపర్బ్ అంటున్నారు!
- ఈ రోజే థియేటర్లకు 'జంబ లకిడి పంబ'
- శ్రీనివాసరెడ్డికి మంచి మార్కులు
- కథానాయికగా సిద్ధి ఇద్నాని
ఈ సినిమా చూసినవాళ్లు .. వరుణ్ పాత్రలో శ్రీనివాస రెడ్డి తెగ సందడి చేసేశాడని చెబుతున్నారు. స్త్రీగా శ్రీనివాస రెడ్డి తన బాడీ లాంగ్వేజ్ ను మార్చుకున్న తీరు సూపర్బ్ అంటున్నారు. అచ్చం అమ్మాయిలా ప్రవర్తిస్తూ హాస్యాన్ని పండించడంలో అదరగొట్టేశాడనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కామెడీ ప్రధానంగా సాగే కథలకు శ్రీనివాస రెడ్డి మరింత బలాన్ని ఇస్తాడనే విషయం మరోసారి స్పష్టమైందని చెబుతున్నారు. ఈ సినిమా శ్రీనివాస రెడ్డికి హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.