తాతయ్య పాత్ర చేయాలంటే భయమేసింది .. తప్పించుకోవడానికి కుదర్లేదు: చైతూ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తాతయ్య పాత్ర చేయాలంటే భయమేసింది .. తప్పించుకోవడానికి కుదర్లేదు: చైతూ

  • ఓ రోజున నాగ్ అశ్విన్ వచ్చి కలిశాడు 
  • తాతయ్య పాత్రను చేయమన్నాడు 
  • నాన్న కూడా ప్రోత్సహించాడు  
వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ నాగచైతన్య ముందుకు వెళుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఆయన 'మహానటి' సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు పాత్రను చేశాడు. ఆ విషయాన్ని గురించి తాజా ఇంటర్వ్యూలో నాగచైతన్య ప్రస్తావించాడు. "నాగ్ అశ్విన్ వచ్చి 'మహానటి'లో తాతయ్య పాత్రను నేను చేయవలసి ఉంటుందని చెప్పాడు.తాతయ్య పాత్రను చేయాలంటే నాకు భయం వేసింది .. అందుకే నా వల్ల కాదని చెప్పాను. కానీ నాగ్ అశ్విన్ ఒత్తిడి చేయడంతో కొంత సమయం ఇవ్వమని అడిగాను. ఆ తరువాత నాన్నను అడుగుదాం .. ఆయన వద్దంటే ఆ విషయమే నాగ్ అశ్విన్ కి చెప్పి తప్పించుకోవచ్చు అని అనుకున్నాను. తీరా నాన్నకు విషయం చెబితే .. ఇంతమంచి అవకాశాన్ని వదులుకోవద్దంటూ ప్రోత్సహించాడు. అలా నేను ఈ సినిమాలో చేయవలసి వచ్చింది .. ఇప్పుడు ఈ పాత్రలో నా నటనకి వస్తోన్న రెస్పాన్స్ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తోంది" అని చెప్పుకొచ్చాడు.  
nagachaitanya

More Telugu News