హన్సిక చుట్టూ తిరిగే కథ .. ఏడు దేశాల్లో షూటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హన్సిక చుట్టూ తిరిగే కథ .. ఏడు దేశాల్లో షూటింగ్

  • యూత్ లో హన్సికకి క్రేజ్ 
  • తమిళంలో భారీ ప్రాజెక్టు 
  • వచ్చేనెలలో సెట్స్ పైకి  
తెలుగు .. తమిళ భాషల్లో అందాల కథానాయికగా హన్సికకి మంచి క్రేజ్ వుంది. తెలుగులో ఆమెకి అవకాశాలు తగ్గినా, తమిళంలోను పోటీ గట్టిగానే వున్నా అవకాశాలను బాగానే అందుకుంటోంది. 'చంద్రకళ' వంటి ఒకటి రెండు సినిమాలు మినహాయిస్తే, ఇప్పటివరకూ హన్సిక చాలావరకూ కథానాయకుడి సరిజోడీగా కనిపిస్తూనే ఆడియన్స్ ను అలరిస్తూ వచ్చింది.

అలాంటి హన్సిక కథానాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి రెడీ అవుతోంది. దర్శకుడిగా జమీల్ ఈ సినిమా ద్వారా పరిచయమవుతున్నాడు. కథ ప్రకారం ఈ సినిమాను ఏడు దేశాల్లో చిత్రీకరించనున్నారట. ఏడు దేశాల్లో చిత్రీకరించే సన్నివేశాలు .. ఆయా సందర్భాలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయని అంటున్నారు. 'గరుడ వేగ' సినిమాను నిర్మించిన కోటీశ్వరరాజు ఈ సినిమాకి నిర్మాత. జూన్ లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.  
hansika

More Telugu News