ఎన్టీఆర్ కు, చంద్రబాబుకు తేడా అదే!: ఏపీ మంత్రి చినరాజప్ప
- ఎన్టీఆర్ అయితే నిర్ణయం తొందరగా చెప్పేస్తారు
- చంద్రబాబు అలా కాదు..ఆలోచిస్తారు
- బీజేపీ కంట్రోల్ లో జగన్ ఉన్నారు
- బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో పవన్ కల్యాణ్ ఆలోచనలో పడ్డారు
ఏపీలో త్వరలో ఎన్నికలు జరుగుతాయి కనుక, ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి ఎలా ఉందో చంద్రబాబు సర్వే చేయిస్తున్నారని.. ఈ మేరకు ఆయన నిర్ణయం తీసుకుంటారని అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత జగన్ గురించి ఆయన మాట్లాడుతూ, బీజేపీ కంట్రోల్ లో జగన్ ఉన్నారని విమర్శించారు. బీజేపీ-వైసీపీ కలిసే ఉన్నాయనడానికి చాలా సంఘటనలు నిదర్శనమని అన్నారు. బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో పవన్ కల్యాణ్ కూడా ఆలోచనలో పడ్డారని, బీజేపీతో వెళితే తాను కూడా మునిగిపోతానని ఆయన భావించారని, ఆపై ఏ నిర్ణయం తీసుకుంటారో మరి! అని చెప్పుకొచ్చారు.