ఓటీటీ సెంటర్ కి మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్!
- ఊర్వశి ప్రధాన పాత్రగా 'ఆశ'
- కీలకమైన పాత్రను పోషించిన జోజు జార్జ్
- క్రితం నెలలో థియేటర్లకు వచ్చిన సినిమా
- ఈ నెల 16 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్
- 4 భాషల్లో అందుబాటులోకి రానున్న కంటెంట్
మలయాళం ఇండస్ట్రీ నుంచి సైకలాజికల్ సినిమాలు ఎక్కువగా వస్తుంటాయి. మలయాళంలో ఈ జోనర్ నుంచి వచ్చిన సినిమాలకి, ఓటీటీ వైపు నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు .. ఆ పాత్రల స్వభావాలను మలచిన తీరు అందుకు కారణమనుకోవాలి. ఈ నేపథ్యంలో మరో సైకలాజికల్ సినిమా ఓటీటీ ఆడియన్స్ ముందుకు రావడానికి ముస్తాబవుతోంది. మలయాళంలో రూపొందిన ఆ సినిమా పేరే 'ఆశ'.
సనర్ సనాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను వినాయక అజిత్ నిర్మించాడు. సీనియర్ నటి ఊర్వశి .. జోజు జార్జ్ ప్రధానమైన పాత్రలను పోషించిన సినిమా ఇది. ఈ సినిమాకి కథను అందించినది జోజు జార్జ్ కావడం విశేషంగా చెప్పుకోవాలి. సెప్టెంబర్ 11వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, అక్టోబర్ 16వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ భాషల్లోను అందుబాటులోకి రానుంది.
కథలోకి వెళితే .. 'ఆశ' నడివయసు దాటిన ఒక మహిళ. తన జీవితంలో ఎదురైన సంఘటనల కారణంగా ఆమెలో మొడితనం పెరుగుతూ పోతుంది. అలాంటి ఆమె తన కూతురు కూతురుతో కలిసి నివసిస్తూ ఉంటుంది. ఐటీలో జాబ్ చేస్తున్న తన కూతురుతో కలిసి ఆమె ఒక రాత్రివేళ కారులో ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఆ సమయంలోనే 'జీమన్' కారును ఢీ కొడుతుంది. అతనితో గొడవ పడుతుంది. ఆ గొడవ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనేది కథ.