రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు: డీఎంకే ఫైర్

రాహుల్ గాంధీ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారు: డీఎంకే ఫైర్

Rahul Gandhi criticized by DMK over Tamil Nadu voter list deletions
  • తమిళనాడు ఓటర్ల తొలగింపుపై రాహుల్ మౌనం వహిస్తున్నారన్న శరవణన్
  • సర్ పై ఢిల్లీలో నిరసణలు చేపట్టడంపై విమర్శ
  • తమిళనాడు ఓటర్ల తొలగింపుపై రాహుల్ స్పందన ఏమిటని ప్రశ్న
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై డీఎంకే తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. తమిళనాడులో ఓటర్ల జాబితా నుంచి లక్షలాది పేర్లను తొలగించడంపై మౌనంగా ఉంటూ, ఇదే అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో నిరసనలు చేపట్టడంపై మండిపడింది. రాహుల్ రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నారని ఆరోపించింది. ఈ మేరకు డీఎంకే అధికార ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఎక్స్ వేదికగా రాహుల్‌ను సూటిగా ప్రశ్నించారు. 

"తమిళనాడులో ఓటర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ వైఖరి ఏమిటి? 'సర్' ప్రక్రియ తర్వాత ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయాలన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటనను రాహుల్ ఎందుకు సమర్థించడం లేదు? రాహుల్ తీరు ఎప్పటికీ మారదని ఘాటుగా వ్యాఖ్యానించారు.

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్, డీఎంకే మధ్య దశాబ్దాల మైత్రికి తెరపడిన విషయం తెలిసిందే. నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంతో... జాతీయ స్థాయిలో ఇండియా కూటమి నుంచి డీఎంకే వైదొలగింది. ఈ నేపథ్యంలోనే, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఇండియా కూటమి నిర్వహించిన నిరసనలకు డీఎంకే దూరంగా ఉంది. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా తమిళనాడులో సుమారు 97 లక్షల ఓటర్ల పేర్లను తొలగించారని డీఎంకే ఆరోపిస్తోంది.
Advertisement
Rahul Gandhi
DMK
Tamil Nadu Voter List
Saravanan Annadurai
INDIA Alliance
Voter Deletion Controversy

More Telugu News