అమ్మాయిల దుస్తుల్లో హీరో.. అబ్బాయిలా హీరోయిన్.. ‘జంబ లకిడి పంబ’ మోషన్ పోస్టర్
- మురళీ కృష్ణ దర్శకత్వంలో ‘జంబ లకిడి పంబ’
- హీరోగా శ్రీనివాసరెడ్డి
- అలరిస్తోన్న పోస్టర్
ఈ రోజు ‘జంబ లకిడి పంబ’ మోషన్ పోస్టర్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో శ్రీనివాసరెడ్డి అమ్మాయిల దుస్తులు వేసుకుని సిగ్గుపడుతూ కనపడుతున్నాడు. ఇక అబ్బాయిలా దుస్తులు వేసుకున్న హీరోయిన్ సిద్ది ఇద్నాని గంభీరంగా కనపడుతోంది. ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు.