ఆనం మృతి పట్ల సంతాపం తెలిపిన చంద్రబాబు, హరికృష్ణ
- ఆనం మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన చంద్రబాబు
- సంతాపం వ్యక్తం చేసిన కోడెల, నారా లోకేష్
- ఈ ఉదయం కన్నుమూసిన ఆనం
ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల, డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రులు నారా లోకేష్, కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణలతో పాటు నందమూరి హరికృష్ణ ఆనం మృతిపట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆనం ఈ ఉదయం హైదరాబాదులోని కిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే.