ఆత్మ సాక్షిగా నా కూతురికి ప్రమాణం చేస్తున్నాను.. కాపాడుకుంటాను: సన్నీలియోన్‌ ట్వీట్‌
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆత్మ సాక్షిగా నా కూతురికి ప్రమాణం చేస్తున్నాను.. కాపాడుకుంటాను: సన్నీలియోన్‌ ట్వీట్‌

  • కథువా ఘటన నేపథ్యంలో సన్నీ ట్వీట్
  • ఈ ప్రపంచంలోని చెడు నుంచి నా కూతురిని రక్షించుకుంటాను
  • జీవితాన్ని ఆమె రక్షణ కోసం అంకితం చేస్తాను
జమ్ముకశ్మీర్‌లోని కథువాలో ఎనిమిదేళ్ల చిన్నారిపై జరిగిన దారుణ ఘటనపై బాలీవుడ్‌ శృంగార తార సన్నీలియోన్‌ పరోక్షంగా స్పందించింది. చిన్నారులకు రక్షణ లేని సమాజం గురించి ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన దత్త పుత్రిక నిషాను హత్తుకుని ఉన్న ఫొటోను ఆమె పోస్ట్ చేస్తూ తన మనసు, శరీరం, ఆత్మ సాక్షిగా తన కూతురికి ప్రమాణం చేస్తున్నానని, ఈ ప్రపంచంలోని చెడు నుంచి ఆమెను రక్షించుకుంటానని పేర్కొంది. తన జీవితాన్ని ఆమె రక్షణ కోసం అంకితం చేస్తానని,  క్రూరుల నుంచి పిల్లలు సురక్షితంగా ఉండాలని చెప్పింది. పిల్లల్ని మరింత జాగ్రత్తగా చూసుకుందామని, కాపాడుకుందామని ఆమె భావోద్వేగపూరితంగా ట్వీట్ చేసింది. 
Sunny Leone
Twitter
kathua

More Telugu News