జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తున్న హీరోయిన్ అంజలి....వీడియో వైరల్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తున్న హీరోయిన్ అంజలి....వీడియో వైరల్

  • నాజూగ్గా తయారవుతున్న అంజలి
  • సూపర్ స్టార్ రజనీ సినిమా కోసమేనని వెల్లడి
  • దాదాపు 30 సినిమాలకు పైగా యాక్టింగ్
పదహారణాల తెలుగమ్మాయి ఎలా ఉంటుందంటే హీరోయిన్ అంజలిని చూపిస్తే సరిపోతుంది. ఆకట్టుకునే ముఖారవిందం ఆమె సొంతం. తెలుగుతో పాటు తమిళం, కన్నడ భాషల్లో ఇప్పటివరకు దాదాపు 30కి పైగా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ నటించింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చిత్రాంగద, డిక్టేటర్, శంకరాభరణం, బలుపు, జర్నీ, షాపింగ్ మాల్ చిత్రాలతో నటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

 అయితే ప్రతి సినిమాలోనూ ఆమె బొద్దుగా ముద్దుగా కనిపిస్తూ వచ్చింది. ఈ క్రమంలో కొద్ది రోజులుగా ఆమె జిమ్‌లో తెగ వర్కవుట్లు చేస్తోంది. అందుకు కారణం...కార్తీక్ సుబ్బురాజ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించనున్న చిత్రం కోసమే ఆమె ఇలా నాజూగ్గా తయారవుతోందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా విడుదల కాలేదు.
Anjali
Kollywood
Jim

More Telugu News