మమ్ముట్టితో సినిమాకు అనుష్క అంగీకరించేసింది
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మమ్ముట్టితో సినిమాకు అనుష్క అంగీకరించేసింది

  • గౌతమ్ మీనన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ 
  • మమ్ముట్టితో సినిమాకి ఓకే
  • తెలుగు ఆడియన్స్ లో ఆసక్తి    
తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి విపరీతమైన క్రేజ్ వుంది. కథానాయిక ప్రాధాన్యత కలిగిన పాత్రల్లోనూ ఆమె తన సత్తా చాటుకుంది. అలాంటి అనుష్కకి గతంలో హిందీ .. మలయాళం నుంచి కూడా కూడా భారీగా అవకాశాలు వచ్చాయి. అయినా అప్పుడు ఆమె పెద్దగా ఆసక్తిని చూపించలేదు. అయితే తాజాగా ఆమె ఓ మలయాళ సినిమాను చేయడానికి అంగీకరించడం విశేషం.

ఈ మలయాళ మూవీలో కథానాయకుడిగా మమ్ముట్టి నటించనున్నారు. ఈ కారణంగానే అనుష్క ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు. ఈ మధ్య మలయాళంలో మమ్ముట్టికి జోడీగా నయనతార మంచి మార్కులు కొట్టేసింది. అయినా ఆయన తాజా చిత్రంలో అనుష్కకి ఛాన్స్ దక్కడం విశేషం. ఆల్రెడీ తమిళంలో గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఓకే చెప్పిన అనుష్క, మలయాళంలో మమ్ముట్టి సరసన నటించడానికి రెడీ అవుతోంది. ఇక తెలుగులో ఆమె నెక్స్ట్ మూవీ ఏంటనేది ఇక్కడి ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 
mammootty
anushka

More Telugu News