మాఫియా నేపథ్యం .. డిఫరెంట్ లుక్ తో శర్వానంద్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాఫియా నేపథ్యం .. డిఫరెంట్ లుక్ తో శర్వానంద్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • ఈ నెల 6వ తేదీ నుంచి షూటింగ్ మొదలు
  • మాఫియా డాన్ గా శర్వా డిఫరెంట్ లుక్  
నాని తరువాత కథల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించే కథానాయకులలో శర్వానంద్ ను చెప్పుకోవచ్చు. యూత్ లోను .. ఫ్యామిలీ ఆడియన్స్ లోను శర్వానంద్ కి మంచి క్రేజ్ వుంది. వాళ్ల అభిరుచికి తగినట్టుగా పాత్రలను మలచుకునే శర్వానంద్ .. తాజాగా సుధీర్ వర్మ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఆయన మాఫియా డాన్ గా డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు.

ఈ నెల 6వ తేదీ నుంచి ఈ సినిమా షూటింగ్ విశాఖలో మొదలుకానుంది. ఆ తరువాత షెడ్యూల్స్ ను కాకినాడ .. హైదరాబాద్ లలో ప్లాన్ చేశారు. ఇంతవరకూ శర్వానంద్ చేసిన సినిమాల్లో ఎక్కువ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా ఇదే. ఈ సినిమా కోసం 20 కోట్లకి పైగా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. 'కేశవ' తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కావడంతో, ఇది కూడా కొత్తదనంతో కూడుకున్న కాన్సెప్ట్ అయ్యుంటుందనే నమ్మకంతో అంతా వున్నారు.      
sharwanand
sudheer varma

More Telugu News