రవితేజ మూవీలో మరో హీరోయిన్ గా నివేదా థామస్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవితేజ మూవీలో మరో హీరోయిన్ గా నివేదా థామస్?

  • శ్రీను వైట్లతో రవితేజ 
  • ఆయన సరసన అనూ ఇమ్మాన్యుయేల్
  • కాజల్ 'నో' చెప్పింది అందుకేనట  
శ్రీను వైట్ల దర్శకత్వంలో రవితేజ 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో ఒక కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. మరో కథానాయికగా కాజల్ ను తీసుకోవడానికి శ్రీను వైట్ల చాలా ప్రయత్నించాడట.

అయితే పారితోషికం తక్కువగా ఇస్తామనడం .. రవితేజతో గతంలో తాను చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడం కారణంగా ఈ సినిమాలో చేయడానికి కాజల్ 'నో' చెప్పేసిందట. దాంతో మరో హీరోయిన్ గా నివేదా థామస్ ను తీసుకోవాలనే ఉద్దేశంతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇక నివేదా థామస్ ఏమంటుందో చూడాలి మరి.  
raviteja
Niveda Thomas

More Telugu News