పంటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ప్లెక్సీలు...ఆంధ్ర రైతు వినూత్న ఆలోచన..!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పంటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ప్లెక్సీలు...ఆంధ్ర రైతు వినూత్న ఆలోచన..!

  • వరిపంటకు కంటిదిష్టి మళ్లించేందుకు శృంగార తార ప్లెక్సీలు
  • దిగుబడి బాగా పెరిగిందంటున్న రైతు..!
  • దిష్టి నివారణకు నెల్లూరు రైతు వినూత్న ఆలోచన
ఏపుగా ఎదిగిన తన వరి పైరుపై ఏ మాయదారి కళ్లు పడకుండా అంటే.. దిష్టి తగలకుండా బాలీవుడ్ శృంగార తార సన్నీ లియోన్ ప్లెక్సీలను ఏర్పాటు చేసి పంట దిగుబడిని పెంచుకున్నానని చెబుతున్నాడో ఆంధ్రా రైతు. వివరాల్లోకెళితే, ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాలో ఉన్న బండికింద పల్లె గ్రామంలో చెంచు రెడ్డి అనే రైతు తన పది ఎకరాల పొలానికి దిష్టి తగలకుండా బికినీ ధరించి ఉన్న సన్నీ లియోన్ ప్లెక్సీలను ఏర్పాటు చేశాడు. ఈ చిన్న గ్రామం మీదుగా వెళ్లే వారు ఇప్పుడు ఆయన పొలం వద్ద ఏర్పాటు చేసిన సన్నీ ప్లెక్సీలకేసి తదేకంగా చూస్తున్నారు. వాటిని ఏర్పాటు చేసిన తర్వాత తన పంట దిగుబడి బాగా పెరిగిందని రెడ్డి చెబుతున్నాడు.

జనాల కళ్లు ప్లెక్సీలపై పడటంతో తన పంటకు కంటిదిష్టి తగ్గిందని, తద్వారా దిగుబడి పెరిగిందని రెడ్డి నవ్వుతూ చెబుతున్నాడు. తొలుత జనాల దృష్టిని మళ్లించేందుకు కొన్ని రోజులు చాలా కష్టపడ్డానని, తన మదిలో వచ్చిన మెరుపు లాంటి ఆలోచనతో సన్నీ ప్లెక్సీలను ఏర్పాటు చేశానని, దాంతో దిష్టి బెడద బాగా తగ్గిపోయిందని అతను అంటున్నాడు.

సన్నీ లియోన్ ప్లెక్సీలపై "ఒరేయ్....నన్ను చూసి ఏడ్వకురా" అని రాసుంది. సాధారణంగా కంటిదిష్టి తగలకుండా రైతులు తమ పంట పొలాల వద్ద దిష్టిబొమ్మలను ఏర్పాటు చేయడం కద్దు. కానీ చెంచు రెడ్డి కాస్త క్రియేటివ్‌గా ఆలోచించి ఇలా సన్నీ లియోన్ ప్లెక్సీలు పెట్టి తన పంట దిగుబడిని పెంచుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరికొందరికి ఆయన ప్రయత్నం ఆదర్శంగా మారినా అతిశయోక్తి కాదు.
Sunny Leone
Farmer
Nellore District
Rice

More Telugu News