సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • సన్నీ లియోన్ పై డాక్యుమెంటరీ రెడీ!
  • థాయిలాండులో రానా దగ్గుబాటి 
  • నిన్నటి నాయిక రంభ మళ్లీ వచ్చేస్తోంది!
  • 'కార్తికేయ' సీక్వెల్ పనులు మొదలు      
*  బాలీవుడ్ శృంగారతార సన్నీ లియోన్ జీవితకథ ఆధారంగా రూపొందించిన 'కరంజిత్' డాక్యుమెంటరీ చిత్రం నిర్మాణం పూర్తయింది. జీ టీవీ గ్రూప్ నిర్మించిన ఈ చిత్రంలో సన్నీ లియోన్ జీవిత ప్రస్థానం మొత్తం ఆవిష్కృతమవుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు.    
*  రానా దగ్గుబాటి నటిస్తున్న 'హాథి మేరే సాథి' చిత్రం షూటింగ్ ప్రస్తుతం థాయిలాండ్ లో జరుగుతోంది. ఇటీవలే రానా కూడా ఈ షూటింగులో జాయిన్ అయ్యాడు. నెల రోజుల పాటు ఈ షూటింగ్ అక్కడ జరుగుతుంది.  
*  ఒకప్పుడు గ్లామర్ కథానాయికగా ఊపేసిన రంభ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోంది. కమెడియన్ సప్తగిరి హీరోగా ఈశ్వర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందే చిత్రంలో రంభ ఒక కీలక పాత్రను పోషించనున్నట్టు సమాచారం.
*  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన 'కార్తికేయ' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని సాధించింది. దీంతో దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 'కనితన్' తెలుగు రీమేక్ పూర్తయ్యాక హీరో నిఖిల్ ఈ చిత్రాన్ని చేస్తాడట.    
Sunny Leone
rana
nikhil

More Telugu News