మాస్ కంటెంట్ చైతూకి ఈసారైనా కలిసొచ్చేనా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మాస్ కంటెంట్ చైతూకి ఈసారైనా కలిసొచ్చేనా?

  • చందూ మొండేటితో 'సవ్యసాచి 
  • మారుతితో 'శైలజా రెడ్డి అల్లుడు'
  • తదుపరి చిత్రం బాబీతో  
ప్రస్తుతం చైతూ .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. అలాగే మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ఆయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. 'జై లవ కుశ' తో హిట్ కొట్టిన బాబీ, అల్లు అర్జున్ తో ఓ సినిమా చేయడానికి కసరత్తు చేశాడు గానీ కుదరలేదు.

 దాంతో చైతూను కలిసి ఒక కథ చెప్పాడట. మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే అంశాలతో సిద్ధం చేసిన ఆ కథ నచ్చడంతో చైతూ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అయితే మొదటి నుంచి కూడా లవర్ బాయ్ గా చేసిన సినిమాలు చైతూకి కలిసొచ్చాయిగానీ, మాస్ సబ్జెక్టులు కలిసి రాలేదు. మరి బాబీతో చేసే మాస్ ఎంటర్టైనర్ చైతూకి ఎంతవరకూ కలిసొస్తుందో చూడాలి.      
nagachaitanya

More Telugu News