పెద్ద బ్యానర్లో గోపీచంద్ హీరోగా సినిమా?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పెద్ద బ్యానర్లో గోపీచంద్ హీరోగా సినిమా?

  • 'తొలిప్రేమ' సక్సెస్ తో బీవీఎస్ ఎన్ ప్రసాద్ 
  • గోపీచంద్ తో సినిమా అంటూ టాక్ 
  • దర్శకుడిగా వీరు పోట్ల పేరు
భారీ చిత్రాల నిర్మాతగా బీవీఎస్ ఎన్ ప్రసాద్ కి మంచి పేరుంది. ఆయన నిర్మించిన సినిమాలు కొన్ని ఘన విజయాలను అందుకున్నాయి. అలాగే తాజాగా ఆయన నిర్మించిన 'తొలిప్రేమ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. విడుదలైన ప్రతి ప్రాంతం నుంచి భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ నేపథ్యంలో ఆయన తదుపరి సినిమాకి సన్నాహాలు మొదలెట్టినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

గోపీచంద్ హీరోగా వీరు పోట్ల దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేయనున్నట్టు ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ వస్తున్నా .. గోపీచంద్ హిట్ కొట్టి చాలాకాలమే అయింది. ఇక ఈ మధ్య వీరు పోట్ల దర్శకత్వం వహించిన 'ఈడు గోల్డ్ ఎహే' పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో బీవీఎస్ ఎన్ ప్రసాద్  ఈ కాంబినేషన్లో సినిమా చేయనున్నాడనే వార్త, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.      
gopichand
veeru potla

More Telugu News