పారితోషికం విషయంలో దిగిరాని కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పారితోషికం విషయంలో దిగిరాని కాజల్!

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ 
  • మరో కథానాయిక కోసం కాజల్ తో సంప్రదింపులు
ఒక వైపున సీనియర్ హీరోలతోను .. మరో వైపున యువ కథానాయకులతోను కాజల్ వరుస సినిమాలు చేసేస్తోంది. తాజాగా వచ్చిన 'అ!' చిత్రంలో తన పాత్ర ద్వారా ఆమె మరోమారు ప్రేక్షకులను మెప్పించింది. ఇక కల్యాణ్ రామ్ సరసన 'ఎమ్మెల్యే' సినిమా చేస్తోన్న ఆమె, త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఆమెకి శర్వానంద్ సినిమాలో అవకాశం వచ్చింది.

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను తీసుకున్నారు. మరో హీరోయిన్ గా కాజల్ ను సంప్రదించారు. అయితే ఈ సినిమా కోసం ఆమె అడిగిన పారితోషికం .. సాధారణంగా తీసుకునే దానికంటే ఎక్కువేనట. ఆమెకి ఇవ్వాలనుకున్న పాత్ర ముఖ్యమైనదే అయినా నిడివి కాస్త తక్కువగా వుంటుందట. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఓ మెట్టుదిగమని అడుగుతున్నారు. ఈ విషయం కారణంగానే ఆలస్యం జరుగుతోందనీ .. ఆమె చేసేది లేనిది త్వరలో తేలిపోతుందని అంటున్నారు.     
sharwanand
kalyani

More Telugu News