కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ
Add ap7am to your home Screen

కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేసిన టీ కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ

  • కేసీఆర్ హైదరాబాద్ లో పులి..ఢిల్లీలో పిల్లి
  • ముస్లిం రిజర్వేషన్ పెంపు బిల్లు గురించి కేసీఆర్ ప్రస్తావించరే?
  • కందులు, ఎర్రజొన్నలకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
సీఎం కేసీఆర్ పై టీ కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, హైదరాబాద్ లో కేసీఆర్ పులి అని, ఢిల్లీలో పిల్లి అని విమర్శించారు. ఏపీకి న్యాయం చేయాలంటూ ఆ రాష్ట్ర ఎంపీలు పార్లమెంట్ లో పోరాడారని, మరి, తెలంగాణ విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ముస్లిం రిజర్వేషన్ పెంపు బిల్లు గురించి ఆయన ప్రస్తావించారు. ఆ బిల్లు ఎక్కడ ఉందో కేసీఆర్ చెప్పాలని, కందులు, ఎర్రజొన్నల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, కర్ణాటక తరహాలో మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
KCR
Telangana
Shabbir Ali
Congress

More Telugu News