ఆ నేతలపై ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం: సుప్రీంకోర్టును కోరిన ఎన్నికల కమిషన్
- ఐదేళ్ల శిక్ష పడే కేసుల్లో నిందితులైతే ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం
- చట్ట సవరణ దిశగా కేంద్రాన్ని ఆదేశించాలని సుప్రీంకోర్టులో అఫిడవిట్
- ఎన్నికలకు కనీసం ఆరు నెలల ముందు కేసు నమోదు కావాలని క్లాజ్
కాగా, ఈసీ అఫిడవిట్ రాజ్యాంగ పరిధులను దాటి ఉన్నందున, పార్లమెంటులో చట్టాన్ని చేయాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించడం అంత సులభమేమీ కాదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈసీ సూచనలతో కేంద్రంపై మరింత ఒత్తిడి వస్తుందని భావిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో అంతర్గత ప్రజాస్వామ్యం కరవైందని, ఎన్నికల్లో అంగ, అర్థబలాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని కూడా ఈసీ తన అఫిడవిట్ లో పేర్కొంది.