కేసీఆర్ పెద్ద లోఫర్, కేటీఆర్ చిన్న లోఫర్: షబ్బీర్ అలీ
Add ap7am to your home Screen

కేసీఆర్ పెద్ద లోఫర్, కేటీఆర్ చిన్న లోఫర్: షబ్బీర్ అలీ

  • కేసీఆర్ గతంలో పాస్ పోర్ట్ ఏజెంట్ గా పని చేశారు
  • కేసీఆర్, కేటీఆర్ ల చెంపలను ప్రజలు పగలగొడతారు
  • రైతులకు రూ. 2 లక్షల రుణాలు మాఫీ చేస్తాం
కాంగ్రెస్ పార్టీని లోఫర్ పార్టీ అని విమర్శించిన మంత్రి కేటీఆర్ పై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ పెద్ద లోఫర్ అని, మంత్రిగా ఉన్న కేటీఆర్ చిన్న లోఫర్ అని ధ్వజమెత్తారు. కేసీఆర్ గతంలో పాస్ పోర్ట్ ఏజెంట్ గా పని చేశారని అన్నారు.

కేసీఆర్, కేటీఆర్ ల చెంపలను ప్రజలు వాయించే రోజు దగ్గర్లోనే ఉందని చెప్పారు. దళితుడ్ని ముఖ్యమంత్రిని చేస్తానన్న కేసీఆర్... తెలంగాణ రాగానే సీఎం పీఠం ఎక్కారని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే... రైతులకు రూ. 2 లక్షల వంతున రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు.
KCR
KTR
Shabbir Ali

More Telugu News