శర్వానంద్ ఆ డైరెక్టర్ కి ఇంకా ఓకే చెప్పలేదట!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శర్వానంద్ ఆ డైరెక్టర్ కి ఇంకా ఓకే చెప్పలేదట!

  • హను రాఘవపూడితో ఓ సినిమా 
  • సుధీర్ వర్మ డైరెక్షన్లో మరో మూవీ 
  • శ్రీనివాస్ రాజుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడంటూ ప్రచారం
కథల ఎంపిక విషయంలో .. దర్శకులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే విషయంలో శర్వానంద్ చాలా జాగ్రత్తగా ఉంటాడు. అందువల్లనే ఆయన సక్సెస్ గ్రాఫ్ ఎక్కువగా ఉందని సన్నిహితులు అంటూవుంటారు. ప్రస్తుతం ఆయన హను రాఘవపూడి దర్శకత్వంలో ఒక సినిమా, సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు.

ఈ రెండు ప్రాజెక్టులతో పాటు ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టినట్టుగా వార్తలు వచ్చాయి. 'దండుపాళ్యం' దర్శకుడు శ్రీనివాస్ రాజు వినిపించిన లైన్ కి శర్వానంద్ ఓకే చెప్పేశాడనీ, ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లనున్నారనే టాక్ వచ్చింది. ఈ దర్శకుడికి శర్వానంద్ ఇంకా ఓకే చెప్పలేదట. పూర్తి బౌండ్ స్క్రిప్ట్ తీసుకొచ్చి వినిపించమనీ, నచ్చితేనే చేస్తానని శర్వానంద్ చెప్పాడట. దాంతో అందుకు శ్రీనివాస్ రాజు మూడు నెలల సమయం తీసుకున్నాడని అంటున్నారు. ఆ తరువాత ఏం జరుగుతుందో చూడాలి మరి.  
sharwanand

More Telugu News