'ఛలో' సినిమాపై క్రేజ్ ఒక రేంజ్ లో వుంది!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఛలో' సినిమాపై క్రేజ్ ఒక రేంజ్ లో వుంది!

  • నాగశౌర్య తాజా చిత్రంగా 'ఛలో'
  • అన్ని ప్రాంతాల్లోనూ మంచి బిజినెస్ 
  • హిట్ పడటం ఖాయమంటూ టాక్       
తెలుగు తెరపై దూసుకుపోతున్న యువ కథానాయకులలో నాగశౌర్య ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. యూత్ లో లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న నాగశౌర్య, 'ఛలో' సినిమాతో వచ్చేనెల 2వ తేదీన ప్రేక్షకులను పలకరించనున్నాడు. నాగశౌర్య సొంత బ్యానర్లో రూపొందిన ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటించింది.

రూ. 6 కోట్ల లోపు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా, రూ. 8 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని అంటున్నారు. ఓవర్సీస్ లోనూ ఈ సినిమా మంచి బిజినెస్ జరుపుకున్నట్టుగా సమాచారం.  కంటెంట్ లో విషయం ఉండటం వల్లనే ఈ సినిమాకి ఈ స్థాయి బిజినెస్ జరిగిందని చెబుతున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ సినిమా ప్రమోషన్స్ ను భారీ స్థాయిలో చేస్తున్నారు. ఈ సినిమాతో నాగశౌర్యకి తప్పకుండా హిట్ పడుతుందనే టాక్ వినిపిస్తోంది. ఇదే రోజున రవితేజ 'టచ్ చేసి చూడు' కూడా విడుదలవుతుండటం విశేషం.      
nagashourya
rashmika

More Telugu News