హోంవర్క్ చేయలేదని.. తోటి విద్యార్థులతో బాలికను చెంపదెబ్బలు కొట్టించిన ఉపాధ్యాయుడు!
- మధ్యప్రదేశ్‌లోని థండ్ల పట్టణంలో ఘటన
- ఆరు రోజుల్లో 168 చెంపదెబ్బలు తిన్న 12 ఏళ్ల విద్యార్థిని
- స్కూల్‌కి వెళ్లాలంటేనే భయపడిపోతోన్న వైనం
- పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు
మరిన్ని వివరాలు చూస్తే... హోం వర్కు చేయని ఆ బాలికను ఆరు రోజుల పాటు 14 మంది విద్యార్థులు చెంపదెబ్బలు కొట్టాలని ఉపాధ్యాయుడు మనోజ్‌కుమార్ ఆదేశించాడు. అతడి సూచనను పాటిస్తూ జనవరి 11 నుంచి 16 వరకు ఆమెను తోటి విద్యార్థులు ఒక్కొక్కరు రోజుకు రెండు సార్లు చొప్పున చెంపదెబ్బలు కొట్టారు. దీంతో భయపడిపోయిన ఆ బాలిక స్కూలుకి వెళ్లనని తన తండ్రితో చెప్పింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.